హన్మకొండ (భారత్ స్పెక్ట్రమ్) జూలై 14
వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎన్. శ్వేత, అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను హన్మకొండలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ నూతన కమిషనర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ భేటీలో వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు సత్య శారద, చాహత్ బాజ్ పాయ్ కూడా పాల్గొన్నారు.
వరంగల్ నూతన పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎన్. శ్వేత, అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను హన్మకొండలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ నూతన కమిషనర్ కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ భేటీలో వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు సత్య శారద, చాహత్ బాజ్ పాయ్ కూడా పాల్గొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, మహిళలు, చిన్నారుల భద్రత, శాంతిభద్రతలు, నేర నియంత్రణ వంటి పలు కీలక అంశాలపై వీరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.












