ఎక్స్ ప్రెస్ బస్సులను ప్రారంభించిన పోచారం శ్రీనివాస్.

బాన్సువాడ జై భారత్ ఆగస్టు 16 : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీ ఎస్ ఆర్ టి సి) బాన్సువాడ డిపోకు కేటాయించిన రెండు కొత్త ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసు లను శనివారం ఘనంగా ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు లు జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. నిజామాబాద్ నుండి జహీరాబాదు వరకు బోధన్, బాన్సువాడ, నిజాంసాగర్ మీదుగా నడిచే సర్వీసు,అలాగేబాన్సువాడనుండినారాయణఖేడ్ వరకు పిట్లం,నిజాంపేట్ మీదుగా నడిచే బస్సు సర్వీసులను అందుబాటులోకితీసుకొచ్చారుఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు,విద్యార్థినులు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించు కుంటున్నారనీ ఆన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీగణనీయంగా పెరిగిందన్నారు. పెరిగినడిమాండ్ నుతీర్చడానికే ఆర్టీసీ కొత్త బస్సులను కేటాయిస్తుందన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు,ఈసర్వీసులు మరింత ఉపయోగ కరంగా  నిలుస్తాయన్నారు. కొత్తఉద్యోగులు,విద్యార్థులకు బస్సు సర్వీసులు ప్రారంభం కావడంతో బాన్సువాడ, బోధన్,నిజాంసాగర్ ప్రాంతాల ప్రజలు సులభంగా నిజామాబాద్,జహీరాబాదు పట్టణాలకు చేరుకోవచ్చు. అదేవిధంగా పిట్లం,నిజాంపేట్, నారాయణఖేడ్ మార్గం ద్వారా ప్రయాణించే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని అధికారులుపేర్కొన్నారు.కార్యక్రమంలో బాన్సువాడ డిపో మేనేజర్ ఆర్. సరిత దేవి,ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment