నిర్మల్ జై భారత్ జూన్:2(నాని భోజన్న) తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి జాతీయ పతాక ఆవిష్కరణ చేసారు. అనంతరం మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ వస్తె బతుకులు బాగుపడతాయని, బంగారు తెలంగాణ అవుతుంది అనుకుంటే అప్పుల తెలంగాణ గా మార్చారని మండి పడ్డారు. ప్రజలు కలలు కన్న తెలంగాణ బీజేపీ తోనే సాధ్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట, జిల్లా , పట్టణ, మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ తోనే సామాజిక తెలంగాణ సాధ్యం-ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి.
Updated On: June 2, 2025 1:01 pm
