నందిపేట్ జై భారత్ మే:25 ( షేక్ గౌస్ ) నందిపేట్ గ్రామ ముస్లిం కమిటీకి నూతన అధ్యక్షుడిగా షౌకతుల్ బారీ గారు ఆదివారం జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ షాదీఖానాలో నిర్వహించిన సమావేశంలో ముస్లిం పెద్దలు, సభ్యులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా షౌకతుల్ బారీ అధ్యక్షుడిగా, సయ్యద్ జమీల్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పదవీకాలం ముగిసిన అహ్మద్ ఖాన్ స్థానంలో ఈ ఎన్నికలు నిర్వహించామని కమిటీ సభ్యులు తెలిపారు. పూర్తి కార్యవర్గాన్ని త్వరలో మరో సమావేశంలో ఎన్నుకుంటామని వెల్లడించారు.ఈ సమావేశంలో మాజీ అధ్యక్షులు కలీమ్, మజహర్‌ఉద్దీన్, సయ్యద్ హుస్సైన్, మండల కమిటీ స్థాపకుడు షేక్ ఘౌస్, స్థానిక ఆరు మసీదు అధ్యక్షులు మరియు గ్రామ ముస్లింలు పాల్గొన్నారు.షౌకతుల్ బారీ మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని, తనను ఈ పదవికి ఎన్నుకున్న ముస్లిం సమాజానికి కృతజ్ఞతలు తెలిపారు.
నందిపేట్ ముస్లిం కమిటీకి షౌకతుల్ బారీ ఏకగ్రీవ అధ్యక్షుడిగా ఎన్నిక
Updated On: May 25, 2025 8:15 pm
