తెలంగాణ రాష్ట్ర బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 29 : తెలంగాణకు తీవ్ర వాయుగుండం ముప్పు పొంచి ఉంది. మొంథా తుఫాన్ బలహీనపడి తెలంగాణ వైపు పయనిస్తోంది. భద్రాచలానికి 50 కి.మీ, ఖమ్మంకు 110 కి.మీల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. ఉత్తర-వాయువ్య దిశగా ప్రయాణించి రాబోయే ఆరు గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలంగాణ, ఏపీలో బుధవారం భారీ వర్షాలు కురవనున్నాయి.నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట.తెలంగాణలో నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్, 8 జిల్లాలకు అరెంజ్ అలర్ట్, 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ వాతావరణ అధికారులు జారీ చేశారు. తుపాన్ ప్రభావంతో గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
తెలంగాణకు తీవ్ర వాయుగుండం ముప్పు.
Published On: October 29, 2025 9:50 pm











