నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ : 7

బీఆర్ఎస్ రజతోత్సహం,
పాతికేళ్ల సమరోత్సహం
బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మగౌరవ గొంతుక
తెలంగాణ సబ్బండ వర్గాల ఆకాంక్షల నుండి పుట్టిన పార్టీ
14 ఏళ్ల పోరాటం, 10 ఏళ్ల పాలన మేళవింపు బీఆర్ఎస్
వరంగల్ బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ మీటింగ్ అంటేనే
తెలంగాణ ద్రోహులపై ఫైటింగ్
బీఆర్ఎస్ వినూత్న ఆలోచనలు, ఆందోళనల కర్మాగారం
సామాజిక, చరిత్రాత్మక అవసరాల కోసం బీఆర్ఎస్ ఆవిర్భావం
కేసీఆర్ చావునోట్లో తల పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు.
పదేండ్ల కేసీఆర్ పాలన దేశానికే దిక్సూచి
కాంగ్రెస్ పాలనలో ప్రశ్నార్ధకంగా మారిన తెలంగాణ భవిష్యత్తు
సీఎం రేవంత్ తెలంగాణను అమ్మకానికి పెట్టారు.
420హామీల అమలులో సర్కారు ఘోర వైఫల్యం
రేవంత్ దుష్ట పాలనపై తెలంగాణ రగులుతోంది
సబ్బండ వర్గాలు రేవంత్ తుగ్లక్ పాలనపై తిరగబడాలి
కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే
ఇక్కడి బీజేపీ నేతలు తెలంగాణ మట్టి వాసనే గిట్టని గుజరాత్ గులాంలు
బీ ఆర్ ఎస్ వరంగల్ రజతోత్సవ సభ కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి నాంది వరంగల్ సభకు గులాబీ సైన్యం కదం తొక్కాలి బీ ఆర్ ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో జీవన్ రెడ్డి భారత రాష్ట్ర సమితి రజతోత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 27వ తేదీన తలపెట్టిన వరంగల్ జనజాతర దుష్ట కాంగ్రెస్ అవినీతికర, అవకాశవాద, అభివృద్ది నిరోధక దిక్కుమాలిన పాలనకు ఉప్పుపాతర వేస్తుందని బీ ఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ _ పెర్కిట్ ఎం ఆర్ గార్డెన్స్ లో సోమవారం ఈ నెల 27 న వరంగల్ లో జరిగే బీ ఆర్ ఎస్ రజతోత్సవ బహిరంగ సభను విజయ వంతం చేయడానికి చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఆర్మూర్ నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ రజతోత్సహం.పాతికేళ్ల సమరోత్సహంగా అభివర్ణించారు.బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మగౌరవ గొంతుక.తెలంగాణ సబ్బండ వర్గాల ఆకాంక్షల నుండి పుట్టిన పార్టీ.
14 ఏళ్ల పోరాటం, 10 ఏళ్ల పాలన మేళవింపు బీఆర్ఎస్ ప్రస్థానం. వరంగల్ బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ మీటింగ్ అంటేనే
తెలంగాణ ద్రోహులపై ఫైటింగ్.
బీఆర్ఎస్ వినూత్న ఆలోచనలు, ఆందోళనలు, త్యాగాల కర్మాగారం.
సామాజిక, చరిత్రాత్మక అవసరాల కోసం బీఆర్ఎస్ ఆవిర్భవించింది. కేసీఆర్ చావునోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు.
ఢిల్లీని కదిలించి రాష్ట్రాన్ని సాధించారు. పదేండ్ల కేసీఆర్ పాలన దేశానికే దిక్సూచిగా నిలిచింది’ అని ఆయన పేర్కొన్నారు.
కేసీఆర్ ప్రారంభించిన మిషన్ భగీరథ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు.
రైతుబంధు పథకం జాతీయ స్థాయిలో పీఎం కిసాన్ పథకానికి ప్రేరణనిచ్చిందని ఆయన గుర్తు చేశారు.
దేశంలో అత్యంత ఎక్కువ వరి ధాన్యం పండించే రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దారన్నారు. రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయానికి నాణ్యమైన 24 గంటల కరెంటు అందించిన చరిత్ర కేసీఆర్ దని జీవన్ రెడ్డి వివరించారు . ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాదు ఇవ్వని హామీలను కూడా అమలు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదని ఆయన చెప్పారు. హామీ ఇవ్వకపోయినా 13 లక్షల మంది పేదింటి ఆడపిల్లలకు 11,000 కోట్లు ఖర్చుపెట్టి కళ్యాణ లక్ష్మి పథకం అమలు చేసిన ఘనత కేసీఆర్ దన్నారు. రైతుబంధు, రైతు బీమా, ఉచిత చేప పిల్లల పంపిణీ, ఉచిత గొర్రెల పంపిణీ, కేసీఆర్ కిట్టు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్టు, కంటి వెలుగు, అమ్మ ఒడి హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం ఇలా అనేక పథకాలు చెప్పకపోయినా అమలు చేశామని జీవన్ రెడ్డి గుర్తు చేశారు.మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి కొట్లాడిన పార్టీ బీ ఆర్ఎస్ అని ఆయన చెప్పారు.
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారిందని జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ తెలంగాణను అమ్మకానికి పెట్టారని ఆరోపించారు.
ఎన్నికల్లో ఇచ్చిన 420హామీల అమలులో సర్కారు ఘోర వైఫల్యం చెందిందని జీవన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో ఒక్క గ్యారెంటీని కూడా అమలు చేయలేదన్నారు.
ఉచిత బస్సు ప్రయాణం ఒకటే కల్పించి మహాలక్ష్మి పథకం కింద ఇస్తామన్న 2500 ఎగ్గొట్టారని ఆయన మండిపడ్డారు.
రైతుబంధు, 2 లక్షల రుణమాఫీ అన్నారు, అమలు చేయలేదు. ఇచ్చిన హామీల అమలు చేయని చరిత్ర కాంగ్రెస్ ది. రేవంత్ దుష్ట పాలనపై తెలంగాణ రగులుతోంది.
సబ్బండ వర్గాలు రేవంత్ తుగ్లక్ పాలనపై తిరగబడాలి.
కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే
ఇక్కడి బీజేపీ నేతలు తెలంగాణ మట్టి వాసనే గిట్టని గుజరాత్ గులాంలుగా మారారు. బీ ఆర్ ఎస్ వరంగల్ రజతోత్సవ సభ కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి నాంది. వరంగల్ సభకు గులాబీ సైన్యం కదం తొక్కాలి అని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఈ సన్నాహక సమావేశంలో ఆర్మూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గ ఇంఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పూజ నరేందర్, నందిపేట్ మండల అధ్యక్షులు మచ్చర్ల సాగర్, కౌన్సిలర్లు చక్రు, లింబాద్రి గౌడ్, మధర్, మాజీ ఎంపీపీలు మస్త ప్రభాకర్, వాకిడి సంతోష్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీలు సుక్కి సుధాకర్, దేవేందర్, మాజీ పీఏసీఎస్ ఛైర్మన్లు కార్తీక్ రెడ్డి, బంటు మహిపాల్, పార్టీ సీనియర్ నాయకులు నక్కల భూమేష్, వెల్మల్ రాజన్న, శ్రీనివాస్ గౌడ్ లతో పాటు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.