నిరుపేద ఆదివాసి నాయకపోడ్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

నిజామాబాద్ జిల్లా బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 27 : (నవీన్ కుమార్) శనివారం నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం నాగేపూర్ గ్రామానికి చెందిన కీర్తి శేషులు తోకల గంగాధర్ గత మూడు నెలల క్రితం రోడ్ ప్రమాదంలో తీవ్రగాయాలై చికిత్స పొందుతూ మృతి చెందినాడు,మృతుని కుమారుడు కూడా ఒక సంవత్సరం క్రితం చనిపోయినాడు, మృతునికి, ఇద్దరు పెళ్లి కానీ ఆడపిల్లలు ఉన్నారు అని మృతుని కుటుంబం పేద కుటుంబం అని తెలిసి నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఆదివాసి నాయకపోడ్ కులస్తులు పేద వారికి సహాయం చేయాలని ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్న నేను సైతం నాయకపోడ్ ల చేయుతకై అనే వాట్సప్ గ్రూపు ద్వారా చూసి జిల్లాలో ఉన్న ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, యువకులు జిల్లాలో ఉన్న కులస్తులు తల కొంత ఆర్థిక సాయం చేయడం జరిగింది. మొత్తం 38000/- విరాళాల రూపంలో వచ్చిన వాటిని ఆదివాసి నాయకపోడ్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు గాండ్ల రాంచందర్ గారు మృతుని కుటుంబానికి కుటుంబానికి అందజేశారు అందజేశారు.ఇట్టి కార్యక్రమంలో జిల్లా సలహాదారుడు వేంపల్లి లోలం గంగాధర్, జిల్లా ఉపాధ్యక్షుడు ఇంగోలీ సాయిలు, జిల్లా నాయకులు మన్నే సాగర్, దుంపల శ్రీనివాస్ మరియు నాగేపూర్ గ్రామ ఉపసర్పంచ్ సాయి కుమార్, కుల పెద్ద మనుషులు మృతుని కుటుంబీకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన కుల పెద్దమనుషులు గ్రామస్తులు వీరు కుటుంబానికి జిల్లాలో ఉన్న ఆదివాసి నాయకుడు కులస్తులు ఆర్థిక సాయం చేయడం ఎంతో సంతోషదాయకమని సహాయం చేసిన వారికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసినారు.

Join WhatsApp

Join Now

Leave a Comment