సృజనాత్మకతకు వేదిక ‘యువ కెరటాలు’ కవి సమ్మేళనం తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతి కుమార్

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:18
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన తెలంగాణ యువ కెరటాలు ” శీర్షికన యువ కవుల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షులు అవంతి కుమార్ పేర్కొన్నారు.ఆదివారం ఎమ్మెల్సీ కవిత కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.తెలంగాణ సారస్వత పరిషత్ లో జరగనున్న ఈ సమ్మేళనానికి సంబంధించిన కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా అవంతి కుమార్ మాట్లాడుతూ ఈకవి సమ్మేళనం తెలంగాణ యువత సృజనాత్మకతకు వేదిక అని అన్నారు.సాహిత్య రంగంలో యువతను ప్రోత్సహించడానికి తమ అధ్యక్షురాలు కవిత చేస్తున్న కృషి ముందుతరాలకు ఆదర్శంగా ఉంటుందన్నారు. తెలంగాణ సమాజంలో కనిపించే సమిష్టితత్వాన్ని ప్రతిబింబించేలా యువ కవులు,కవయిత్రులు తమ కలాలకు పదును పెట్టాలని ఆయన కోరారు.జిల్లా నుంచి యువసాహితీవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయనఆహ్వానించారు.పాల్గొనదలచిన కవులు, కవయిత్రులు 35 ఏళ్ల లోపువారు అయి ఉండాలని,తెలుగు, హిందీ ఇంగ్లీష్,ఉర్దూ భాషలలో తమ కవితలు వినిపించవచ్చని.యువ కవులు కవయిత్రులు తమ పేరును నమోదు చేయించుకోవడానికి తమ వివరాలతో ఈ నెల 26వ తేదీ లోపు kavitha.telangana@gmail.com కు మెయిల్ చేయాలని వివరించారు. కవులు కవయిత్రులు తెలంగాణ తొలి,మలి దశ ఉద్యమ చరిత్రను,పోరాట స్పూర్తిని తమ కవితలలో చాటిచెప్పాలని,ఆయన కోరారు.ప్రముఖ కవి ఘనపురం దేవేందర్, తెలంగాణ జాగృతి సాహిత్య విభాగం కన్వీనర్ తిరుమల శ్రీనివాస్ ఆర్య, శ్యామల సాయి కృష్ణ, హరీష్ యాదవ్,ఆకాష్,, తేలు సరిత,శోభవతి, సరిత,నితిన్,బుచ్చమ్మ రోహిత్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!