విద్యార్థినిలతో బస్సుప్రయాణం చేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి.

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 23 : ఆర్టీసీ బస్సుల్లో రద్దీతో విద్యార్థినిలు పడుతున్న ఇబ్బందులను గమనించిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాసరెడ్డి ఈనెల 14న ఎస్ ఆర్ ఎన్ కె కళాశాల నుండి బాన్సువాడ జూనియర్ కళాశాల వరకు బాన్సువాడ డిపో మేనేజర్ కు ఫోన్ చేసి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేయించిన విషయం తెలిసిందే. ఈవిషయమై ఈనెల 23 గురువారం రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ తో కలిసి అకస్మికంగ బస్సు సర్వీసులను తనిఖీ చేసి విద్యార్థినిలతోపాటు బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి విద్యార్థినిలతొ ముచ్చటిస్తూ చదువులు, వసతులు, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తాము ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా సమయానికి కాలేజీ వరకు సంతోషంగా వెళ్తున్నామని, తమ సమస్యపై స్పందించి వెంటనే ప్రయాణ సౌకర్యం కల్పించిన పోచారం శ్రీనివాసరెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ తనిఖీ కార్యక్రమంలో దేశాయిపేట్ మాజీ సర్పంచ్ మోరీల్ శ్రావణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment