తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 20.
స్థానిక బీర్కూర్ మండల కేంద్రంలో గల బీసీ బాలుర వసతిగృహాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా PDSU(S)-TSP ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఎన్. బాల్ రాజ్, మావురం శ్రీకాంత్ లు మాట్లాడుతూ హాస్టల్ లో నాణ్యతతో కూడిన భోజనం విద్యార్థులకు ఎప్పటికప్పుడు వండి పెట్టాలని, స్నానపు గదులు, మరుగుదొడ్లు ప్రతిరోజు శుభ్రపరచాలని,విద్యార్థులకు ప్రతి రోజు మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలని, అక్కడ పనిచేసే వర్కర్లకు చెప్పడం జరిగింది.అలాగే విద్యార్థులతో మాట్లాడి సమస్యల విషయాల గురించి చెప్పడం జరిగింది. స్థానికంగా బీర్కూర్ హాస్టల్ కి పరిమినెంట్ వార్డెన్ ని నియమించాలని,పరిమినెంట్ వార్డెన్ లేకపోవడం వల్ల విద్యార్థులకు ఇబ్బందులు ఏర్పడతాయని,కావున సంక్షేమ హాస్టళ్లకు తక్షణమే పర్మినెంట్ వార్డెన్ లను నియమించాలని, ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో PDSUS నాయకులు విట్టల్, రాజ్ లు పాల్గొనడం జరిగింది.