నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 7.
బాల్కొండ మండలం కిసాన్ నగర్ జలాల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చిత్రపటాలకు బిఆర్ఎస్ శ్రేణులు గురువారం పాలాభిషేకం చేశారు. కిసాన్ నగర్ ఎక్స్ రోడ్డు నుండి జలాల్పూర్, నాగపూర్ ఎక్స్ రోడ్డు వరకు రెండు కోట్ల 42 లక్షల రూపాయలతో డబల్ రోడ్డు పనులను పూర్తి చేయించినందుకు నాలుగు గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ పాలాభిషేకం చేశారు. మాజీ ఎంపీపీ నాగభూషణం, ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సభ్యులు లావణ్య వెంకటేష్, నాగపూర్ , కిసాన్ నగర్ మాజీ ఎంపీటీసీ సభ్యులు ఈపీ నారాయణ, రామ్ రాజ్ గౌడ్, ఇత్వార్పేట్ మాజీ సర్పంచ్ మండల గంగారాం, జలాల్పూర్ మాజీ సర్పంచ్ కల్పన అనిల్, కిసాన్ నగర్, జలాల్పూర్, ఇత్వార్ పేట్, నాగపూర్ గ్రామాలకు చెందిన బిఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
మాజీ సీఎం, కె సి ఆర్ మాజీ మంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం
Published On: November 7, 2024 11:49 am
