ప్రభుత్వ హాస్పిటల్స్ ను బలోపేతం చేయాలి. ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ ఫీజుల దోపిడీని అరికట్టాలి P Y L- P O W నాయకుల డిమాండ్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ శుక్రవారం నవంబర్ 22.

ఆర్మూర్ పట్టణ కేంద్రంలో.మన తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్ ను బలోపేతం చేసి, ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఫీజుల దోపిడీని అరికట్టాలంటూ ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ (P Y L ) ప్రగతిశీల మహిళా సంఘం (P O W ) నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్ లో  PYL- P O W ల ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్స్ ను బలోపేతం చేసి, ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ ఫీజుల దోపిడీని అరికట్టాలంటూ రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం (POW) జిల్లా ఉపాధ్యక్షురాలు వి సత్తెమ్మ పి వై ఎల్ జిల్లా అధ్యక్షులు అనిస్ లు మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రులలో డాక్టర్లు, నర్సులు సరిపడ లేకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేటటువంటి పేద ప్రజలకు సరియైన వైద్య సేవలను అందించడం లేదని, పేషెంట్లకు వైద్య పరీక్షల సౌకర్యం లేక బయటకు వెళ్లి ప్రైవేట్ ల్యాబులలో టెస్టులకు విపరీతమైనటువంటి ఫీజులు చెల్లించుకోలేక సరియైన వైద్యాన్ని ఉండలేక పోతున్నారని వారు అన్నారు .ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం (POW ) జిల్లా నాయకులు జి.పద్మ, ఎన్.లక్ష్మి ,PYL జిల్లా కమిటీ సభ్యులు బట్టు రవి, మనోజ్, గంగాధర్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

 

 

 

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!