జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రచారంలో పాల్గొన్న నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ 

తెలంగాణ  రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 29 : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బుధవారం నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ రహమత్ నగర్ డివిజన్ పరిధిలో బీజేపీ అభ్యర్థి శ్రీ లంకల దీపక్ కిమద్దతుగా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజలతో మమేకమవుతూ మాట్లాడుతూ గత పదేళ్లుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి పట్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చూపిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైందని విమర్శించారు.ప్రజల ఆకాంక్షలు నెరవేర్చగల పార్టీగా, పారదర్శక పాలనతో ప్రజల విశ్వాసం గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రజలకు నిజమైన ప్రత్యామ్నాయమని తెలిపారు.ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు.“జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సమగ్ర అభివృద్ధి తీసుకురావగల నాయకుడు శ్రీ లంకల దీపక్ మాత్రమే.ఎల్లప్పుడూ ప్రజలతో మమేకమై సేవ చేసేవారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఆయనకు అండగా నిలిచి గెలిపించి కాంగ్రెస్ ముసుగులో ఉన్న మజ్లిస్ నేతలకు తగిన బుద్ధి చెప్పాలి.”ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థి తరపున ఇంటింటికి వెళ్లి, ప్రజల మద్దతు కోరారు.ప్రచారంలో పాల్గొన్న బీజేపీ నాయకులు, స్థానిక కార్యకర్తలు ప్రజల ఉత్సాహభరితమైన స్పందనను చూసి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు తంగెళ్లపల్లి లక్ష్మణ్, సౌభాగ్య లక్ష్మీ బీజేపీ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు,మల్లేష్ గుప్తా సీనియర్ నాయకులు,బట్టికిరి ఆనంద్,మరవర్ కృష్ణ,బాలనగేష్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment