రాష్ట్ర స్థాహి అండర్ 14 వాలీబాల్ బాలుర విజేత ఖమ్మం,బాలికల విభాగంలో నిజామాబాద్

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ .

బహుమతులు ప్రధానం చేసిన తూప్రాన్ ఆర్డిఓ జయచంద్ర రెడ్డి మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల గ్రౌండ్లో జరుగుతున్న అండర్ 14 బాల, బాలికల పోటీల్లో ఉమ్మడి పది జిల్లాల నుండి పది బాలికల జట్లు పది బాలుర జట్లు పాల్గొనగా అత్యంత ప్రతిభ చూపి బాలుర విభాగంలో ఖమ్మం జిల్లా జట్టు మొదటి స్థానం సాధించగా రంగారెడ్డి జిల్లా రెండవ స్థానం, వరంగల్ జిల్లా మూడో స్థానం సాధించింది.బాలికల విభాగంలో నిజామాబాద్ జిల్లా మొదటి స్థానం సాధించగా,మెదక్ బాలికల జట్టు రెండవ స్థానం, ఆదిలాబాద్ జిల్లా జట్టు మూడో స్థానం సాధించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తూప్రాన్ ఆర్డీవో జయచంద్ర రెడ్డి గారు మాట్లాడుతూ మాటలు ఆలోచన పొదుపు లేనివాడు దేశాడ్రోహితో సమానమని క్రీడా పోటీల్లో గెలుపోవటంలో సహజమని గెలిచినవారు పొంగిపోవద్దని ఓడినవారు కృంగిపోవద్దని అన్నారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా యస్. జి.ఎఫ్ సెక్రటరీ రమేష్, చేగుంట యం.ఆర్.ఓ నారాయణ,మెదక్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు పరంజ్యోతి,స్థానిక ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ చంద్రకళ, జిల్లా పి.ఈ.టి ల సంఘం జిల్లా అధ్యక్షులు నాగరాజు,మాజీ యస్.జి.ఎఫ్ కార్యదర్శి కిషోర్,అథ్లెటిక్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి మధుసూదన్,ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నాగరాజు,రాష్ట్ర వాలీబాల్ రిఫరీస్ బోర్డు కన్వీనర్ రవీందర్ రెడ్డి,రాష్ట్ర వాలీబాల్ అబ్జర్వర్లు సాయినాథ్,శ్రీనివాస్,వివిధ జిల్లాల నుండి వచ్చిన పి.డి లు పి.ఈ.టీలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!