నిజామాబాద్, 2024-07-06
బెస్ట్ అవైలబుల్ పథకం కింద విజ్ఞాన్ స్కూల్లో చదువుతున్న విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీజీవీపీ) నాయకులు సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి పిర్యాదు చేశారు. ఈ మేరకు వారు కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా టీజీవీపీ టౌన్ ప్రెసిడెంట్ సుంకోజి అఖిల్ మాట్లాడుతూ, ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదనే కారణం చెప్పి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఉచితంగా అందించాల్సిన షూస్, పుస్తకాలు, ఇతర విద్యా సామగ్రికి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు.
అలాగే, విద్యార్థులు ఉపయోగించాల్సిన నోట్ బుక్స్ ను స్కూల్ యాజమాన్యమే అధిక ధరలకు విక్రయిస్తూ, వారికి ఎలాంటి రసీదులు ఇవ్వకుండా విక్రయిస్తున్నారని, వాటిని తప్పనిసరిగా కొనుగోలు చేయాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకు వస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ఈ అంశాలపై సంబంధిత అధికారులు నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ జరిపి, అక్రమాలు జరిగినట్లు తేలితే సంబంధిత యాజమాన్యంపై చట్టపరమైన, శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రతి విద్యార్థికి పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై ఎలాంటి అదనపు ఆర్థిక భారం పడకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో హేమంత్, అంకుష్, రోహన్ తదితరులు పాల్గొన్నారు.