సిరికొండ, 6 September
ప్రజల ఆరోగ్య పరిరక్షణకు గ్రామ అభివృద్ధి కమిటీలు (వీడీసీలు) ప్రత్యేక శ్రద్ధ చూపాలని రావుట్ల గ్రామ అభివృద్ధి కమిటీ (వీడీసీ) చైర్మన్ ఈ. రమేష్ అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవడం కూడా వీడీసీల బాధ్యతేనని, అందులో భాగంగానే రావుట్ల వీడీసీ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించినట్లు తెలిపారు.
ప్రజారోగ్యమే ప్రథమ బాధ్యత.. రావుట్లలో మెగా హెల్త్ క్యాంప్ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు గ్రామ అభివృద్ధి కమిటీలు (వీడీసీలు) ప్రత్యేక శ్రద్ధ చూపాలని రావుట్ల గ్రామ అభివృద్ధి కమిటీ (వీడీసీ) చైర్మన్ ఈ. రమేష్ అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవడం కూడా వీడీసీల బాధ్యతేనని, అందులో భాగంగానే రావుట్ల వీడీసీ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించినట్లు తెలిపారు. మండలం రావుట్ల గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ (వీడీసీ) ఆధ్వర్యంలో బీంగల్కు చెందిన శ్రీ శివసాయి మల్టీ స్పెషాలిటీ చిల్డ్రన్ హాస్పిటల్ సహకారంతో ఆదివారం మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కోడిగేల రాజు రిబ్బన్ కట్ చేసి క్యాంప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వీడీసీ చైర్మన్ ఈ. రమేష్ మాట్లాడుతూ.. ఎంత డబ్బు ఉన్నా ఆరోగ్యం లేకపోతే మనిషి పేదవాడితో సమానమేనన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలని, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో హెల్త్ క్యాంప్ నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి జి. ఎర్రన్న, ఎం.ఎస్. జనరల్ సర్జన్ డాక్టర్ సూర్యనారాయణ ప్రజలకు ఆరోగ్యంపై పలు సూచనలు చేశారు. ఉపసర్పంచ్ ఎస్. శ్రీనివాస్ గౌడ్, వీడీసీ సభ్యులు టీ. రాజన్న, ఎం. భాస్కర్, బి. కిషన్, రిక్క దామోదర్, ఎస్.కె. సాధుల్లా, డి. శశి, గట్టు సాయి, డి. శేఖర్, పి. దాస్, ఎస్. అభి, జి. ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.












