పిప్రి (భారత్ స్పెక్ట్రమ్) ఆగస్టు 07
ప్రపంచ తల్లిపాల వారోత్సవం సందర్భంగా పిప్రి గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అరిగెల జనార్ధన్, ఉపసర్పంచ్ పతాని రంజిత్, గ్రామ కార్యదర్శి జితేందర్, వీడీసీ సభ్యుడు శ్రీనివాస్, వార్డు సభ్యులు మేఘన, అర్చన తదితరులు పాల్గొన్నారు.

తల్లిపాల ఆవశ్యకత
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పుట్టిన గంటలోపే శిశువుకు తల్లిపాలు పట్టించడం అత్యంత ముఖ్యమని తెలిపారు. తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారాన్ని అందించడంతో పాటు శరీరానికి అవసరమైన శక్తిని, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయని వివరించారు. తల్లిపాలు తాగే పిల్లల్లో అంటువ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు.
ఆరు నెలల పాటు తల్లిపాలే
ప్రతి తల్లి తన బిడ్డకు మొదటి ఆరు నెలలు పూర్తిగా తల్లిపాలే అందించాలని, అనంతరం పోషకాహారంతో పాటు రెండేళ్ల వరకు తల్లిపాలను కొనసాగించాలని సూచించారు. తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రతి కుటుంబం అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు.