హైదరాబాద్, 31 July
తెలంణఉదయమసహచడ,మజఎమమెలయే,నబదధతకలననయకడపెదదసదనెడడమణంతననతవదభంతక,వషదనకచేసందనమంతకేటఆతెలప.ఆయనకోలకంటనఆంచన,ఇకలేననవతబధకమనఅనన.
తెలంగాణ ఉద్యమ సహచరుడు, మాజీ ఎమ్మెల్యే, నిబద్ధత కలిగిన ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి, విషాదానికి గురిచేసిందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయన కోలుకుని తిరిగి ప్రజల మధ్యకు వస్తారనే ఆశతో ఎదురుచూశామని, కానీ ఆయన ఇక మన మధ్య లేరన్న వార్త ఎంతో బాధాకరమని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమని కేటీఆర్ కొనియాడారు.
ఉద్యమ ఆశయాలను నమ్మి, జీవితాంతం ప్రజల పక్షాన నిలబడి, పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేసిన నాయకుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఎప్పటికీ గుర్తుండిపోతారని తెలిపారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం భారత రాష్ట్ర సమితి పార్టీకి మాత్రమే కాదు, తెలంగాణ సమాజానికి కూడా తీరని లోటు అని పేర్కొన్నారు.
ఆయన చూపిన నిబద్ధత, ఉద్యమ స్ఫూర్తి పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని కేటీఆర్ అన్నారు.










