నిజామాబాద్, 6 September
గత ఏడాది భారీ వర్షాలు, వరదలకు దెబ్బతిన్న గడ్కోల్ గ్రామంలోని స్మశానవాటిక, పల్లె ప్రకృతి వనం పునరుద్ధరణ పనులు చేపట్టాలని బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం వారు ఆయా ప్రాంతాలను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు.
కూలిన స్మశానవాటికకు మోక్షమెప్పుడు? గడ్కోల్లో స్మశానవాటిక, పల్లె ప్రకృతి వనం పరిశీలించిన బీఆర్ఎస్ నాయకులు గతేడాది భారీ వర్షాలు, వరదలకు దెబ్బతిన్న గడ్కోల్ గ్రామంలోని స్మశానవాటిక నేటికీ పునరుద్ధరణకు నోచుకోకపోవడంపై బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకుడు బాజిరెడ్డి జగన్ పిలుపు మేరకు ఆదివారం గడ్కోల్ గ్రామ బీఆర్ఎస్ శాఖ ఆధ్వర్యంలో స్మశానవాటికను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గ్రామ ప్రజలకు అత్యవసరమైన స్మశానవాటిక దెబ్బతిని ఏడాది గడుస్తున్నా పునర్నిర్మాణ పనులు చేపట్టకపోవడం ఆందోళన కలిగించే విషయమన్నారు. మృతులకు చివరి గౌరవం కల్పించే స్థలాన్ని కూడా నిర్లక్ష్యం చేయడం సరికాదని అన్నారు. బతికున్న ప్రజల సమస్యలతో పాటు చివరి మజిలీకి సంబంధించిన సౌకర్యాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. వర్షాలు, వరదలతో దెబ్బతిన్న స్మశానవాటికను వెంటనే పునరుద్ధరించి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పల్లె ప్రకృతి వనం పరిస్థితిపై ఆందోళన అనంతరం గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని బీఆర్ఎస్ నాయకులు సందర్శించారు. పల్లె ప్రకృతి వనం నిర్వహణ, మొక్కల సంరక్షణపై తగిన శ్రద్ధ కనిపించడం లేదని వారు పేర్కొన్నారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పల్లె ప్రకృతి వనాన్ని అభివృద్ధి చేసి, మొక్కలను సంరక్షించే చర్యలు చేపట్టాలని కోరారు. గ్రామంలో ప్రజలకు ఉపయోగపడే స్మశానవాటిక, పల్లె ప్రకృతి వనం వంటి సదుపాయాలను నిర్లక్ష్యం చేయకుండా సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. స్మశానవాటిక పునర్నిర్మాణం, పల్లె ప్రకృతి వనం పునరుద్ధరణకు నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో గడ్కోల్ గ్రామ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










