డిచ్పల్లి, 2 September
కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల పాలన వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిజామాబాద్ రూరల్ డిచ్పల్లి మండల కేంద్రంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ఎన్నికల హామీల అమలు తీరును ప్రశ్నిస్తూ 420 మీటర్ల ఫ్లెక్సీని ప్రదర్శించారు.
420 మీటర్ల ఫ్లెక్సీతో కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ నిరసన
డిచ్పల్లిలో భారీ ర్యాలీ.. పాల్గొన్న సిరికొండ మండల బీఆర్ఎస్ నాయకులు
సిరికొండ , సెప్టెంబర్ 2: కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల పాలన వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిజామాబాద్ రూరల్ డిచ్పల్లి మండల కేంద్రంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో మాజీ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ నాయకత్వంలో ఈ కార్యక్రమం చేపట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను, వాటి అమలు తీరును ప్రశ్నిస్తూ 420 మీటర్ల పొడవైన ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ బీఆర్ఎస్ నాయకులు వినూత్నంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం నుంచి నాగపూర్ గేట్ వరకు ర్యాలీ కొనసాగింది.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని నాయకులు ఆరోపించారు.
ఈ నిరసన ర్యాలీలో సిరికొండ మండల బీఆర్ఎస్ అధ్యక్షులు నరవోయిన శ్రీనివాస్, నాయకులు భూషణ్ రెడ్డి, మోహన్ రెడ్డి, లింగంతో పాటు పలువురు యువ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ బీఆర్ఎస్ ఇన్చార్జి బాజిరెడ్డి జగన్తో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










