బాల్కొండ, 2026-06-05
కొకదోకసీఆకీోణతయఅహకణీయీఆఎసీయకశ.గదదఏసకసశోఈక.
బాల్కొండ మండల కేంద్రంలోని కేసీఆర్ కాలనీలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను వెంటనే అర్హులకు పంపిణీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు డిమాండ్ చేశారు. గురువారం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు ఈ మేరకు మాట్లాడారు.
గత ప్రభుత్వంలో నిర్మాణం
గత ప్రభుత్వ హయాంలో స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో 176 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించారని తెలిపారు. వాటిలో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం 99 ఇళ్లను అర్హులకు పంపిణీ చేసిందని, మిగిలిన 77 ఇళ్లను వెంటనే అర్హులను గుర్తించి పంపిణీ చేయాలని వారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు
బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి సునీల్ కుమార్ అసత్య ఆరోపణలు మానుకొని అర్హులకు మేలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కిసాన్ నగర్ సర్పంచ్ రాంరాజ్ గౌడ్, మాజీ కోఅప్షన్ సభ్యులు మా.షాహిద్, ఫయాజ్ అలీ, మాజీ ఎంపీటీసీ . నారాయణ, ఇఫ్తాకారోద్దీన్, కన్న పోశెట్టి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ చిన్న బాల రాజేశ్వర్, కట్టెల శ్రీనివాస్ గౌడ్, భూసం కిట్టు, రహిమోద్దీన్, ఎర్ర్రం సాగర్, మామిడి నర్సయ్య, తలారి రాజేందర్, . ప్రసాద్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.










