నిజామాబాద్, 2026-06-05
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన బడా భీంగల్ సర్పంచ్, ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని, ఆమె భర్త, ఉపసర్పంచ్లు పెత్తనం చెలాయిస్తున్నారని మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాగుల గంగా మోహన్, గ్రామ శాఖ అధ్యక్షుడు దాకటి స్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధిపై సర్పంచ్ దృష్టి సారించాలని వారు డిమాండ్ చేశారు.

విలేకరుల సమావేశంలో ఆరోపణలు
బడా భీంగల్ గ్రామంలో స్థానిక నాయకులు, గ్రామస్తులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు ఈ ఆరోపణలు చేశారు. సర్పంచ్‌గా గెలిస్తే 24 గంటలూ ప్రజలకు సేవ చేస్తానని చెప్పి ప్రజల నమ్మకాన్ని చూరగొన్నారని, కానీ గెలిచిన తర్వాత సర్పంచ్ అందుబాటులో లేకుండా పోయారని రాగుల గంగా మోహన్ అన్నారు. ఆమె స్థానంలో ఆమె భర్త, ఉపసర్పంచ్లు గ్రామంలో పెత్తనం చెలాయిస్తున్నారని ప్రశ్నించారు.
హామీల అమలుపై నిలదీత
సొంత ఖర్చులతో అంబులెన్స్, జిమ్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన ప్రధాన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని వారు నిలదీశారు. గ్రామంలో ప్రజలకు ఏవైనా సమస్యలు వస్తే చెప్పుకుందామంటే సర్పంచ్ కుర్చీ ఖాళీగా ఉంటోందని, తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని గ్రామస్తులు వాపోయారు. ప్రజా సమస్యలు తీర్చాల్సిన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రైవేట్ పంచాయతీలకు అడ్డాగా మార్చారని విమర్శించారు.
సర్పంచ్‌కు అల్టిమేటం
సర్పంచ్ వెంటనే అందుబాటులోకి వచ్చి గ్రామాభివృద్ధిపై దృష్టి పెట్టాలని, ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
పాల్గొన్నవారు
ఈ సమావేశంలో గ్రామ శాఖ అధ్యక్షుడు దాకటి స్వామి, రాగుల లింబాద్రి, ఆకుల గంగాధర్, జంగం ప్రభు, రాగుల కిషన్, మాజీ ఎంపీటీసీ వల్లి, ముచ్కూర్ నరేష్, పల్లె మహిపాల్, సూల్ల భూమన్న, అయేటి రవీందర్, గురిజల రాజ గంగారం, దండు మహేష్ తదితరులు పాల్గొన్నారు.