ఒడిశా సీఎం చేతుల మీదుగా జాతీయ అవార్డు అందుకున్న ఏపీఎం మాణిక్యం
నందిపేట్ జై భారత్ జూన్:1(షేక్ గౌస్) దేశంలోని ప్రతి కుటుంబ తలసరి ఆదాయాన్ని పెంచే ఉద్దేశ్యం తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సంఘాలకు ప్రోత్సహిస్తున్నాయి. మహిళల ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా రూపొందిన “లక్షపతి దీదీ” కార్యక్రమం మహిళల జీవితాల్లో మార్పు తీసుకొస్తోంది. ఈ అభియాన్‌లో భాగంగా ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో ఇటీవల జరిగిన జాతీయ స్థాయి సదస్సు లో తెలంగాణ తరఫున నందిపేట మండలమూలో విధులు నిర్వహిస్తున్న ఏపీఎం మాణిక్యం పాల్గొని జాతీయ స్థాయిలో అవార్డు అందుకుని నందిపేట్ మండల కీర్తిని ఇతర రాష్ట్రాలకు వ్యాపైంచారు.మే 29, 30 తేదీల్లో భువనేశ్వర్‌లోని లోక్ సేవా భవన్‌లో జరిగిన “లక్షపతి దీదీ 2025” జాతీయ సదస్సులో ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాజి, డిప్యూటీ సీఎం, ఐఏఎస్ అధికారులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ మహాసభల్లో దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాల నుండి ఎంపికైన మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఇందులో తెలంగాణ రాష్ట్రాము నుండి వెళ్లిన మాణిక్యం, మండల కేంద్రానికి చెందిన అజ్మీరీ బేగం, కొండూరు గ్రామానికి చెందిన మంగు లావణ్యలు హాజరయ్యారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండల మహిళా సమైక్య సంఘం 100 శాతం అజీవికా రిజిస్టరేషన్ పూర్తి చేసి జిల్లా స్థాయిలో మొదటి మండలంగా గుర్తింపు పొందింది. గ్రామ స్థాయిలో 80 మంది లక్పతి దీదీ కుటుంబాలను ఎంపిక చేసి, ప్రతి మూడునెలలకోసారి జీవనోపాధి అభివృద్ధిపై అసెస్‌మెంట్ చేస్తూ, తలసరి ఆదాయం లక్ష రూపాయలు చేరేలా విధానపూర్వకంగా ముందుకుసాగుతోంది. ఇదే కారణంగా నందిపేటకు ఈ అరుదైన గౌరవం దక్కింది.ఐకెపి ద్వారా మహిళలకు రుణాలు అందించి, కిరాణా షాపులు, టైలరింగ్, పాడి పరిశ్రమ, బట్టల షాపులు, లేడీస్ జనరల్ స్టోర్లు, పిండి గిర్నిలు వంటి చిన్నస్థాయి వ్యాపారాల్లో వారిని ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయడంలో మాణిక్యం కీలకపాత్ర వహించారు.ఈ గౌరవం తనకు లభించడంపై మాణిక్యం హర్షం వ్యక్తం చేస్తూ, ఈ అవకాశాన్ని కల్పించిన డీఆర్డీవో అధికారి సాయి గౌడ్, అడిషనల్ డీఆర్డీవో రవీందర్, మండల ఐకెపి సిబ్బంది, మహిళా సంఘాల ప్రతినిధుల సహకారాన్ని ప్రత్యేకంగా గుర్తుచేశారు.ఈ జాతీయ స్థాయి అవార్డు నందిపేట మండలనీకే కాదు, జిల్లాకే గౌరవాన్ని తీసుకొచ్చిందని అధికారులు, సంఘ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.