హిందూ–ముస్లిం ఐక్యతకు నందిపేట్‌ అద్భుత ఉదాహరణ.

నందిపేట్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 13 : (షేఖ్ గౌస్) నందిపేట్ గ్రామంలో జరిగిన శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో ముస్లిం సమాజ నాయకులు పాల్గొని మత సామరస్యానికి నిదర్శనంగా నిలిచారు. ఆధ్యాత్మిక వాతావరణంలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమం హిందూ–ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచింది.ఈ సందర్భంగా మండల ముస్లిం కమిటీ వ్యవస్థాపకుడు షేఖ్ గౌస్ సదర్ మస్జీద్ మౌజా, అహ్మద్ ఖాన్ ,ఎక్స్‌–ఎంపీటీసీ, ఎక్స్‌–సదర్, మజ్హరుద్దీన్ ,ఎక్స్‌–సర్పంచ్, ఎక్స్‌–కో–ఆప్షన్, ఎక్స్‌–సదర్, నసీరుద్దీన్జా,మా మసీదు, షేఖ్ జావీద్ ,ఎక్స్‌–సదర్, జామా మసీదు, సయ్యద్ జమీల్ ,ముస్లిం కమిటీ వైస్ ప్రెసిడెంట్, ఎక్స్‌–సదర్, జామా మసీదు, ఫారూక్ ఖాన్ ,జమాత్ ఏ ఇస్లామీ హింద్, ఇఫ్తేఖారుద్దీన్, కరమత్ అలీ, టీచర్ ఘని, వార్డ్ మెంబర్ రఫీ తదితరులు పాల్గొన్నారు.ముస్లిం నాయకులు ఆలయ ప్రాంగణానికి వచ్చి ఆలయ కమిటీ సభ్యులతో ఆప్యాయంగా పలకరించి, భక్తుల ఆత్మీయ ఆహ్వానం స్వీకరించారు. మతసామరస్యాన్ని ప్రతిబింబించేలా రెండు వర్గాల నాయకులు పరస్పర స్నేహంతో “అలై–బలై” చేసుకుంటూ ఐక్యతకు సంకేతంగా నిలిచారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఉల్లి శ్రీనివాస్ గౌడ్, సుధాకర్ గౌడ్, నామదేవ్ గౌడ్, కిష్ట గౌడ్, నర్స గౌడ్ తదితరులు ముస్లిం నాయకులను ఆహ్వానించి స్వాగతం పలికారు. ఈ స్నేహపూర్వక వాతావరణం నందిపేట్ ప్రజల్లో మత ఐక్యతా భావాన్ని మరింత బలపరిచింది.నిజామాబాద్ జిల్లాలో హిందూ–ముస్లిం ఏకతకు ఇది ఒక చారిత్రాత్మక సందర్భంగా నిలిచింది.

Join WhatsApp

Join Now

Leave a Comment