నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 4.
నందిపేట్‌కు చెందిన యువ నాయకుడు నాగ సురేష్ బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా ఎంపికయ్యారు. ఈ మేరకు మంగళవారం బీజేపీ రాష్ట్ర అధిష్ఠానం ఆయన పేరును ప్రకటించింది. నందిపేట్ నుంచి తొలిసారిగా ఓ యువ నాయకుడికి ఈ బాధ్యత లభించడం విశేషం.విద్యార్థి దశ నుంచే ఏబీవీపీలో చురుకుగా పనిచేసిన ఆయన, ఇంతకుముందు యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా సేవలు అందించారు. ఈ సందర్భంగా నాగ సురేష్ మాట్లాడుతూ, తన నియామకానికి సహకరించిన ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు కులచారి దినేష్ పటేల్లకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ ఇచ్చిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తూ, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని తెలిపారు.నందిపేట్ బీజేపీ నాయకులు ఈ నియామకంపై హర్షం వ్యక్తం చేశారు. స్థానికంగా ఓ యువ నాయకుడికి రాష్ట్ర స్థాయిలో అవకాశం లభించడంతో యువ రాజకీయ నేతలకు ప్రేరణగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.