ఆర్మూర్ జై భారత్ జూలై 1: (షేక్ గౌస్) ఆర్మూర్ సబ్ డివిజన్ ట్రెజరీ కార్యాలయంలో ముహమ్మద్ తాజొద్దీన్ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ (ఏ.టి.ఓ.)గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ట్రెజరీ విభాగంలో క్యాషియర్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, ఎస్.టి.ఓ.గా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. ప్రతి స్థానంలోనూ నిజాయతీ, కృషి, సమర్థతతో ప్రసిద్ధి గాంచిన ఆయనకు ఆర్మూర్ ఏ.టి.ఓ.గా అవకాశం లభించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.పదవీ బాధ్యతల స్వీకరణ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, కార్యాలయ సిబ్బంది ముహమ్మద్ తాజొద్దీన్‌కి పూలగుచ్చాలు అందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తాజొద్దీన్ మాట్లాడుతూ, “ప్రతి స్థాయిలో నేర్చుకుంటూ, అధికారుల మార్గదర్శకంతో ముందుకు వెళ్ళాను. ఈ కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తూ, ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తానని” అన్నారు.
ఆర్మూర్ ట్రెజరీ ఏ.టి.ఓ.గా ముహమ్మద్ తాజొద్దీన్ బాధ్యతలు స్వీకరణ
Published On: July 1, 2025 6:25 pm
