తెలంగాణలో మూసీ నది సాకుతో B.J.P పార్టీ రాజకీయ లబ్ధి కొరకు రాత్రి బస కార్యక్రమం చేయడం ప్రజలను మోసగించడానికే MRPS జాతీయ కార్యదర్శి దళిత రత్న కోండ్ర ఎల్లయ్య మాదిగ

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 20.

MRPS ముఖ్య కార్యకర్తల సమావేశం జినక స్వామి అధ్యక్షతన స్థానిక జిల్లా కార్యాలయంలో జరిగినది. ఈ కార్యక్రమంలో MRPS జాతీయ కార్యదర్శి కోండ్ర ఎల్లయ్య పాల్గొని మాట్లాడుతూ. తెలంగాణలో B.J.P నేతలు చేపడుతున్న మూసి పరివాహక ప్రాంతాల్లో బసచేయడం ఆ ప్రాంత ప్రజలను మోసగించినట్టేనని ప్రజా సమస్యల పరిష్కారం కొరకు కాకుండా కేవలం రాజకీయ లబ్ధి కొరకు బస కార్యక్రమం చేపడుతున్నారని ఆ ప్రాంత ప్రజలు గమనించాలని MRPS పక్షాణ విజ్ఞప్తి చేయుచున్నాము. నిజంగా B.J.P పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఆ ప్రాంత ప్రజల అభివృద్ధి కొరకు ముందుగానే కాపాడే వారని ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కొరకు ప్రజల ముందు నాటకాలు ఆడుతున్నారని B.J.P పాలనలో ఉన్న రాష్ట్రాలు ఒకే విధానం లేని చోట మరో విధానం అవలంబించడం అది వారి పార్టీకే చెందుతుందని గతంలో అయోధ్య రామాలయం నిర్మించడం కొరకు 18 SC,ST,BC కుటుంబాలను బుల్డోజర్ విధానంతో అక్రమంగా అక్కడి ప్రజలను తరలించి వెళ్లగొట్టారని అక్కడి ప్రజల జీవితాలను చిన్నాభిన్నo చేసిన చరిత్ర B.J.P పార్టీకి దక్కిందని ఇప్పుడు ఆ న్యాయాన్ని సరిదిద్దుట కొరకు తెలంగాణలో మొసలి కన్నీరు కారుస్తూ మూసీనది బస కార్యక్రమం చేయడం సరైనది కాదని హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి D.Y చంద్రచూడ్ గారి నేతృత్వంలోని ధర్మాసనం బుల్డోజర్ విధానానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన విషయం గుర్తు చేస్తూ ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో B.J.P పాలిత ప్రాంతాల్లో పేదల ఇండ్లు కూల్చడం ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నార్ధకంగా మారుస్తుందని మూసీ నది అభివృద్ధి పేరుతో B.J.P కేంద్ర ప్రభుత్వం నిధులు తెచ్చి ఆ ప్రాంత ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో నాయకపోడు సేవా సంఘం జిల్లా అధ్యక్షులు పులి శ్రీను, మహజన మహిళా సంఘం జిల్లా కార్యదర్శి CH రాధ,MRPS మహిళా అధ్యక్షురాలు కుక్కల సుధారాణి, నాయకులు దేవి ఉపేందర్, దర్మారపు ఎలేoదర్, కందుకూరి వీరన్న, కాగితాల జ్యోతి, శ్రీదేవి, శిరీష,వెంకటమ్మ, నాగరాజు, భీమ్ సాగర్, విశ్వనాథం, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. 

 

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!