తెలంగాణలో దళితుల అసైన్డ్ భూములను రెగ్యులరైజ్ చేయించి పట్టాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కి MRPS విజ్ఞప్తి 

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ MRPS ముఖ్య కార్యకర్తల సమావేశం MRPS జిల్లా ఇంచార్జ్ బోడ ఎల్లయ్య మాదిగ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కార్యాలయంలో జరిగినది. ఈ కార్యక్రమంలో MRPS జాతీయ కార్యదర్శి కోండ్ర ఎల్లయ్య మాదిగ పాల్గొని మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళితుల అసైన్డ్ భూములన్నింటినీ రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇచ్చే విధంగా C.M రేవంత్ రెడ్డి  అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం.SC ల A,B,C,D వర్గీకరణ అమలు చేసుకోమని సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  వెంటనే స్పందించి అన్ని రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణలో అమలు చేస్తామని మాట ఇచ్చి మాట తప్పి D.S.C నియామకాలు చేపట్టడం వలన మాదిగ మాదిగ ఉపకులాల వారికి తీవ్ర అన్యాయం జరిగిందని రాబోయే నోటిఫికేషన్లు కూడా SC వర్గీకరణ చేయకుండా నోటిఫికేషన్లు ఇవ్వవద్దని C.M రేవంత్ రెడ్డి కి విజ్ఞప్తి చేయుచున్నాము. మాదిగ మాదిగ ఉప కులాలు అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు దళితబందు బదులుగా డా.బి.ఆర్ అంబేద్కర్ సహాయనిధి ద్వారా ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇస్తామని తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారని ఇచ్చిన మాట ప్రకారం తక్షణమే అంబేద్కర్ సహాయ నిధి పథకం అమలు చేయాలని MRPS రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ  ఆధ్వర్యంలో ఈ డిమాండ్ల అమలుకై జనవరి నెల 19-01-2025 న లక్షలాది మందితో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టనున్నము. ఈ డిమాండ్ల అమలుకై రెండు మూడు రోజుల్లో రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మహబూబాబాద్ జిల్లాలో అన్ని మండలాలలో స్కూటర్ ర్యాలీలు నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో నాయక పోడు సేవా సంఘం జిల్లా అధ్యక్షులు పులి శ్రీను, మహజన మహిళా సంఘం జిల్లా కార్యదర్శి CH.రాధ,MRPS మహిళా అధ్యక్షురాలు కుక్కల సుధారాణి, బాలరాజు, సందీప్, బాలకృష్ణ, సాంబయ్య, హనుమంతు, యశ్వంత్, ప్రవీణ్, సంధ్య, రమా, పద్మ, సరస్వతి, విజయ, నిర్మల, అరుణ తదితరులు పాల్గొన్నారు. 

 

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!