తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 25.
బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్ను రాష్ట్ర ప్రభుత్వం యథాతథంగా అమలు చేయాలని భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఇప్పటికే అనేక బీసీ సంఘాలు, మేధావులు ఇచ్చిన సూచనలు అమలుకు నోచుకోలేదన్నారు. హైదరాబాద్లో డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్ బుసాని వెంకటేశ్వరరావుకు ఆమె వినతిపత్రం అందజేశారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం 11 నెలలు తాత్సారం చేసింది. డెడికేటెడ్ కమిటీ స్వతంత్రంగా పనిచేయాలి. ప్రత్యేక కార్యాలయం, మానవ వనరులు, సామగ్రి ఇవ్వకుంటే ఆ కమిటీ ఎలా పనిచేస్తుంది?కులగణనపై నెల రోజుల్లో నివేదిక అంటే ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి చట్టభద్రత కల్పించాలి. రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. హైదరాబాద్లో ఇప్పటికీ 70 శాతం స్టిక్కర్ వేయని ఇళ్లు ఉన్నాయి. 90 శాతం సర్వే పూర్తయిందని ప్రభుత్వం చెబుతోంది. డేటా కంప్యూటరీకరణ చేశారా?’’ అని కవిత ప్రశ్నించారు.