ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 25 : తెలంగాణలో ఏ నియోజకవర్గంలో జరగని అభివృద్ధి బాన్సువాడ నియోజకవర్గంలో జరిగిందని, మా నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి వల్లే సాధ్యమైందని పోచారం వర్గీయులు తెలిపారు. శనివారం పట్టణంలో ఏర్పాటు చేసినవిలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బాన్సువాడలో 2009లో ఓడిపోయి ముఖం చాటేశారని, నియోజవర్గానికి వచ్చి పోచారంపై లేనిపోని ఆరోపణలు చేస్తే సహించేదిలేదన్నారు. 20045 బాన్సువాడకు వచ్చిన బాజిరెడ్డి నియోజకవర్గాన్ని రాయలసీమగా మార్చారని అన్నారు. ప్రభుత్వం మారి అభివృద్ధి పనుల బిల్లులు నిలిచిపోవడంతో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సీఎంని కలిశారని, ఫలితంగా నిలిచిపోయిన రూ. 100 కోట్ల బిల్లులు మంజూరయ్యయని గుర్తు చేశారు. ఈ 16 నెలల్లో నియోజకవర్గానికి రోడ్ల అభివృద్ధికి రూ. 150 కోట్ల నిధులు తీసుకువచ్చారని పేర్కొన్నారు. పోచారం కు ఎలాంటి స్వార్థం లేదని, కేవలంనియోజకవర్గ ప్రజల కోసమే పాటుపడతారన్నారు.తిమ్మాపూర్ వెంకటేశ్వర ఆలయ అభివృద్ధి ఎమ్మెల్యే పోచారం వల్లే సాధ్యమైందన్నారు. మా నాయకుడు బీఆర్ఎస్ లోనే ఉన్నారని, అభివృద్ధి కోసం మాత్రమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ సొసైటీ చైర్మన్ ఎర్వల కృష్ణారెడ్డి, గురు వినయ్, ఒడ్డెర సంఘం జాతీయ అధ్యక్షుడు పిట్ల శ్రీధర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నార్ల సురేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్,ఎజాజ్, ఖాలెక్, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి కోసమే ఎమ్మెల్యే పోచారం సీఎంను కలిశారు
Published On: October 25, 2025 10:04 pm









