KTR కాలనీలో విద్యుత్ స్తంభాలు వీది లైట్లు ప్రారంభించిన M.L.A డా. భూక్య మురళి నాయక్ దళిత రత్న కోండ్ర ఎల్లయ్య

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 10.

మహబూబాబాద్ జిల్లా కేంద్రం 17 వార్డు KTR కాలనీలో గత 10 సం.లుగా నివాసముంటున్న ఇండ్లు లేని నిరుపేదలు M.A సయ్యద్ గారి పేరున ఉన్న అసైన్డ్ భూమి సర్వే నెంబర్ 281/213 గల భూమిని KTR కాలనీ ఇండ్లు లేని నిరుపేదలకు సుమారు 2 1/2 ఎకరాలు భూదానం ఇవ్వగా అట్టి భూమిలో నివాసం ఉంటున్న SC,ST,BC మైనారిటీ కులాల సుమారు 150 కుటుంబాలకు గత ప్రభుత్వంలో ఉన్న M.L.A మాజీ శంకర్ నాయక్ తన C.D.F ద్వారా 10 లక్షల రూపాయలు స్థానిక కౌన్సిలర్ యాళ్ళ పుష్పలత-యాళ్ల మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో మంజూరు చేయించినారు. అట్టి నిధులు 2023 ఎన్నికల సందర్భంగా నిలుపుదల చేయగా 2024 సం.లో కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ప్రజా ప్రతినిధుల సహకారంతో అట్టి నిధులను తిరిగి మంజూరు చేయించగా విద్యుత్ అధికారులు కొత్తగా విద్యుత్ లైన్ మున్సిపాలిటీ వారు విది లైట్లు వేయించినారు.10 సం.లుగా కరెంటుతో కష్టపడుతున్న నిరుపేదలకు శాశ్వత పరిష్కారం చేయించిన స్థానిక M.L.A భూక్య మురళి నాయక్ M.P బలరాం నాయక్ స్థానిక వార్డు కౌన్సిలర్ యాళ్ల పుష్పలత రెడ్డి KTR కాలనీ కమిటీ వ్యవస్థాపకులు కోండ్ర ఎల్లయ్య అభినందనలు తెలియజేసి విద్యుత్ లైన్ వీది లైట్లను ఆవిష్కరణ చేసినారు. స్థానిక M.L.A మాట్లాడుతూ కాలనీ ప్రజలందరూ ఏ కష్టం వచ్చిన ప్రభుత్వం నుండి ఎలాంటి సంక్షేమ పథకాలు వచ్చిన పార్టీలకు అతీతంగా సహకరిస్తానని కాలనీ వారికి ఇలాంటి ఇబ్బంది ఉన్న నేరుగా నన్ను కలవవచ్చని హాని ఇచ్చినారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎడ్ల రమేష్, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఖలీల్, మున్సిపాలిటీ కో-ఆప్షన్ మెంబర్ నిమ్మల శ్రీను,ST సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ గుగులోతు వెంకట్ నీరుటి సురేష్, లింగల వీరభద్రం,KTR కాలనీ అధ్యక్షులు పులి శ్రీను, జగజ్జీ వన్ రామ్ కాలనీ అధ్యక్షులు ముప్పు గుట్టయ్య, భూక్య రాంజీ, మహజన మహిళా సంఘం జిల్లా కార్యదర్శి CH. రాధ, కుక్కల సుధారాణి, దేవి ఉపేందర్, గుంజె బాబు, బాలరాజు, సందీప్, బాలకృష్ణ,సంధ్య,రమా,జయ, మాధవి, అరుణ, ఎల్లమ్మ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!