పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా K.T.R కాలనీలో సదస్సు నిర్వహించిన M.R.O భగవాన్ రెడ్డి ,c.i పెండ్యాల దేవేందర్ 

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్.మహబూబాబాద్ జిల్లా కేంద్రం 17వ వార్డు K.T.R కాలనీలో MRPS జాతీయ కార్యదర్శి కోండ్ర ఎల్లయ్య  ఆధ్వర్యంలో పౌర హక్కుల సదస్సులు నిర్వహించిన M.R.O భగవన్ రెడ్డి,c.i పెండ్యాల దేవేందర్  మాట్లాడుతూ. ఈ దేశంలో పౌర హక్కులు అనేవి ప్రతి మనిషికి ఉంటాయని వాటి ఉల్లంఘనకు ఎవరు పాల్పడిన చట్టపరమైన చర్యలు ఉంటాయని వాటిని ప్రజలందరూ తమ హక్కులను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగం డా.బి.ఆర్ అంబేద్కర్  రాజ్యాంగాన్ని రాయడం వలనే ఈరోజు సమాజంలో సమాన హక్కులు ఉన్నాయని రాజ్యాంగాన్ని అనుసరించడం వలన మేమందరం ఈరోజు ఉద్యోగాలు చేస్తూ ప్రజలను చైతన్య పరుస్తున్నామని ముందుగా డా.బి.ఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించినారు. గ్రామాలలో గాని పట్టణంలో గాని కాలనీలలో ఇంకా కుల వివక్షత, అంటరానితనం లాంటివి ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని c.i దేవేందర్  అన్నారు. ప్రజలు సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎవరు తమ పూర్తి వివరాలను ఎవరికి ఇవ్వకూడదని ఏదైనా సమస్య ఉంటే వెంటనే 100 నెంబర్ కు గాని టోల్ ఫ్రీ నెంబర్ కు గాని సమాచారం ఇవ్వాలని చెప్పినారు.K.T.R కాలనీ ప్రజల ఐక్యత చాలా బాగుందని c.i దేవేందర్  ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో p.c  మోహన్, వీరన్న కాలనీ నాయకులు పులి శ్రీను, దేవి ఉపేందర్, బాలరాజు, సతీష్, కందిపాటి నాగరాజు, శాగంటి రవి,CH. రాధ, కుక్కల సుధ, బొడ్డు మంగమ్మ, జ్యోతి, పార్వతి, రజిత, రమా,జయ, ఎల్లమ్మ, పద్మ, అరుణ, లక్ష్మి, సత్తెమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా M.R.O, మరియు c.i గారికి కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపినారు.

 

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!