నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ :16 ( షేక్ గౌస్)
సన్న బియ్యం లబ్ధిదారులతో కలిసి భోజనం చేసి, వారి తో మాట మంతి చేసిన మంత్రి జూపల్లి.
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి.నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి గ్రామంలో మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం సన్న బియ్యం లబ్ధిదారుడు లక్కారం తవ్వన్న ఇంటీ లో అతని ఉమ్మడి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు.ఈ సందర్భంగా మంత్రి తవ్వన్న కుటుంబ యోగక్షేమాలను, ప్రభుత్వం అందజేస్తున్న సన్న బియ్యం నాణ్యత గురించి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ, “ఇప్పటి తరంలో ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోతున్నాయి. కానీ ఇలాంటివి ఉండటం సంతోషకరం. ఉమ్మడి కుటుంబాల వల్ల ప్రేమాభిమానాలు పెరుగుతాయి, మానసిక ఒత్తిడులు తగ్గుతాయి. మానవ సంబంధాలు బలపడతాయి,” అని అన్నారు.
మరియు… పేద ప్రజల కోసం ప్రభుత్వం చేస్తున్న సహాయం గురించి ప్రస్తావిస్తూ, “గతంలో రేషన్ ద్వారా నాసిరకమైన దొడ్డు బియ్యం ఇవ్వబడుతోంది. చాలామంది తినలేక ఇతరులకు అమ్మేవారు. ఇప్పుడు ప్రభుత్వం నాణ్యమైన సన్న బియ్యం ఇవ్వడం వల్ల లబ్ధిదారులు స్వయంగా తింటున్నారు. ప్రభుత్వంపై భారం ఉన్నప్పటికీ, పేదల కడుపు నింపాలన్నదే ప్రభుత్వ లక్ష్యం,” అని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఆర్మూర్ కాంగ్రెస్ ఇంచార్జ్ వినయ్ రెడ్డి, బాల్కొండ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ అహ్మద్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డీఎస్ఓ అరవింద్ రెడ్డి, సివిల్ సప్లైస్ డీఎం శ్రీకాంత్ రెడ్డి సహా పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.