లక్కంపల్లి సెజ్‌… పరిశ్రమల బదులు “,లీజ్” దందా.

ఉపాధి ఆశ తో భూములు ఇచ్చిన … రైతుల కండ్ల లో కన్నీళ్లు…ఉద్యోగాలు లేక గల్ఫ్ బాట పడుతున్న యువత .

నందిపేట్ జై భారత్ జూలై 3: (షేక్ గౌస్) నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం లక్కంపల్లిలో 13 ఏళ్ల కిందట సెజ్‌ ఏర్పాటు చేశారు.ప్రతి ఇంటికో ఉద్యోగం… ఈ ప్రాంతం పరిశ్రమల కేంద్రం అవుతుంది” అని అప్పట్లో నాయకులు ఇచ్చిన హామీలు ఈరోజు గాలి మాటలుగా మిగిలిపోయాయి.భూములు ఇచ్చిన రైతులు, ఉపాధి కోసం ఎదురుచూసిన యువత… ఇప్పుడు కన్నీటి గాథలు చెబుతున్నారు.భూములు ఇచ్చి… కూలి కి వెళ్ళే దుస్థితి….2009లో సుమారు 379 ఎకరాల భూములు పరిశ్రమల పేరిట సేకరించారు.మొదట భూములు ఇచ్చిన రైతులకే ఉద్యోగాలు ఇస్తాం” అని అన్నారు.కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్ కౌర్, ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 2019లో ఘనంగా ప్రారంభోత్సవం చేశారు.కానీ వాస్తవానికి అక్కడ ఉపాధి లేని స్థితి కొనసాగుతోంది.–మొదలు అయిన కొన్న నెలలకే మూతబడిన యూనిట్లు….మొదట మీట్ ఫామ్, ఆ తర్వాత పసుపు యూనిట్‌ ఏర్పాటు చేసినా కొద్ది నెలల్లో మూతబడింది.స్మార్ట్ ఆగ్రో ఫుడ్ పార్క్‌కి కేంద్రం రూ.100 కోట్లు ఖర్చు చేసింది కానీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని పరిస్థితి.— రైతుల వేదన– భూములు ఇచ్చినప్పుడు మా పిల్లలకు ఉద్యోగం ఇస్తామన్నారు.ఇప్పుడు ఉద్యోగమూ లేదు… సాగుకూడా చేయలేము.మన జీవితాలే త్యాగం అయ్యాయి.— శంకరయ్య, రైతు–13 ఏళ్లు గడిచినా ఒక్క పరిశ్రమా రాలే…ఒక్క ఉపాధి అవకాశమా?..మళ్లీ వాళ్ల మాటలు వినం.— రమేష్, నిరుద్యోగ యువకుడు– … పరిశ్రమల బదులు..రియల్ ఎస్టేట్ గేమ్.పరిశ్రమల పేరిట లోపలి రోడ్లు వేసి, భూమిని చదును చేసి విద్యుత్ లాంటి సకల సౌకర్యాలు కల్పించినాము అంటూ 99 ఏళ్ల లీజు పేర్లతో ఒక్కో ఎకరా రూ.45-50 లక్షలకు సబ్‌లీజ్ ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.ఇప్పటికే కొన్ని రైస్ మిల్లులకు భూములు ఇచ్చారని స్థానికులు చెబుతున్నారు.— ఎన్నికలప్పుడే గుర్తుకు వచ్చే సెజ్!–ప్రతి ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు“ఇక పరిశ్రమలు తెస్తాం… ఉపాధి ఇస్తాం” అని కొత్తగా మాటలు చెబుతుంటారు.కానీ గెలిచాక మళ్లీ ఈ సెజ్ ఎవరికీ గుర్తుండదు. ఎన్నికల కు ముందు సి.ఏం రేవంత్ రెడ్డి సైతం పి సి. సి హోదాలో వచ్చి హామీ ఇచ్చి వెళ్ళారు అని స్థానికులు తెలిపారు. ప్రజల డిమాండ్ . పరిశ్రమల ఏర్పాటుపై తక్షణ స్పష్టత ఇవ్వాలి భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించాలి రియల్ ఎస్టేట్ మోసాలకు అడ్డుకట్ట వేయాలి — “మాకూ ఉపాధి లేకపోతే… ఉద్యమమే దారి!–మేము మా భూములు ఇచ్చాం.ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వాలి.లేదంటే గ్రామ యువతతో కలసి పెద్ద ఉద్యమం చేస్తాం!—స్థానిక నిరుద్యోగులు -సెజ్‌లో వాస్తవాలు.. వివరాలు…భూముల స్వాధీనం 2009లో 379 ఎకరాలు మొదటి యూనిట్లు మీట్ ఫామ్, పసుపు యూనిట్ (మూత) ఫుడ్ పార్క్ రూ.100 కోట్లు, ఉద్యోగం లేదు ప్రస్తుత హంగామా లీజ్‌లతో రియల్ ఎస్టేట్ వ్యాపారం.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!