నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే :22 ( షేక్ గౌస్)
బుల్డోజర్ డ్రైవర్ పోస్టుల భర్తీకి వచ్చిన కొత్త నోటిఫికేషన్ గురించి బీఆర్ఎస్ నేత, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి మాట్లాడారు. ఈ నియామకాలు అభివృద్ధికి కాకుండా ధ్వంసం కోసం తీసుకుంటున్నట్లు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో బుల్డోజర్ ద్వారా ఇంటి, వ్యాపారాలకు నష్టం జరుగుతుండటం ప్రజలకు భయం కలిగిస్తోందని ఆయన చెప్పారు. సుప్రీంకోర్టు కూడా బుల్డోజర్ న్యాయం కుదరదని చెప్పినప్పటికీ, ఈ విధానం కొనసాగుతున్నందుకు ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.అలాగే, రైతులకు అవసరమైన సహాయం లేకపోవడం, పంటలకు తగిన ధరలు లేకపోవడం వంటి సమస్యలు ప్రజల సమస్యలను పెంచుతున్నాయని ఆవేశం వ్యక్తం చేశారు.