ప్రిన్సిపాల్, లెక్చర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన బి ఆర్ ఎస్ వి నాయకులు అభిలాష్ రెడ్డి.
ఆర్మూర్ జై భారత్ జూలై 19 : ఇంటర్ విద్యార్థి ఆత్మహత్మ చేసుకున్నాడు. ఈ ఘటన ఆర్మూర్ పట్టణ శివారులో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వేల్పూర్ గురుకుల పాఠశాలలో ఇంటర్ సెకండియర్ బైపీసీ చదువుతున్న గడ్డం సంతోష్ (17) కశాశాల పక్కనే ఉన్న నర్సరీలో చెట్టుకు ఉరి వేసుకున్నాడు.స్థానికులు వెంటనే వేల్పూర్ పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంతోష్ తండ్రి దుబాయ్లో ఉంటున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ సంఘటనపై బి ఆర్ ఎస్ వి యువ నాయకులు అభిలాష్ రెడ్డి స్పందిస్తూ ప్రిన్సిపాల్, లెక్చర్లపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది.