క్షత్రియ ఇంజినీరింగ్ విద్యార్థుల ఇండస్ట్రియల్ విజిట్

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 27 :(నవీన్ కుమార్) క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల సివిల్ ఇంజినీరింగ్ విభాగం విద్యార్థులు ఇండస్ట్రియల్ విజిట్ కార్యక్రమంలో భాగంగా శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ (పంప్ హౌస్, పోచంపాడ్) ను సందర్శించారు. ఈ సందర్శనలో విద్యార్థులు ఆనకట్ట నిర్మాణ విధానం, నీటి ప్రవాహ నియంత్రణ వ్యవస్థలు, పంపింగ్ స్టేషన్ల కార్యకలాపాలు ,విద్యుత్ ఉత్పత్తి వంటి అంశాలను సమగ్రంగా అధ్యయనం చేశారు. కళాశాల సివిల్ హెచ్‌ఓడీ రాజ్‌కుమార్ మాట్లాడుతూ ఈ తరహా ఇండస్ట్రియల్ విజిట్స్ ద్వారా విద్యార్థులు ప్రాక్టికల్ నాలెడ్జ్ సంపాదించి, క్లాస్‌రూమ్‌లో నేర్చుకునే సిద్దాంతాన్ని వాస్తవ ప్రాజెక్ట్‌లతో అనుసంధానించుకోవచ్చు. ఇది భవిష్యత్తు ఇంజినీర్లకు ఎంతో ఉపయోగకరం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండంట్ అల్జాపూర్ దేవేందర్,కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కట్కం శ్రీనివాస్, కళాశాల ఎ ఓ నరేందర్, అధ్యాపకులు సతీష్, కిరణ్, సాయి రేఖ విద్యార్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment