బాన్స్వాడ తెలంగాణ మోడల్ స్కూల్ లో ఘనంగా భారత రాజ్యాంగ కార్యక్రమం

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 26.

బాన్సువాడ మండలంలోని కొత్తబాది గ్రామంలో తెలంగాణ మోడల్ స్కూల్ లో నెహ్రూ యువ కేంద్రం,సేవా సంఘ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో మేరా యువ భారత్ కార్యక్రమంలో భాగంగా భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారత రాజ్యాంగ దినోత్సవానికి 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాన్లో భాగంగా ,భారత రాజ్యాంగ పరిరక్షణ కొరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించరు, భారత రాజ్యాంగంపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి అంటే విద్యార్థి దశలో పాఠశాలలో ఒక సబ్జెక్టు రూపంలో పొందుపరిస్తే బాగుంటుందని తెలిపారు. అనంతరం మాక్ ఎలక్షన్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్ షేక్ సలాం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కమల్ కిషోర్ ,నెహ్రూ యువ కేంద్ర వలేంటిర్ సునీల్ రాథోడ్, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!