భారత సైన్యం పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు

బిజెపి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక దినపత్రిక నవంబర్ : 02 (నవీన్ కుమార్)  దేశ రక్షణ గురించి,ఆపరేషన్ సింధూర్, భారత సైన్యం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ చత్రపతి శివాజీ చౌక్ వద్ద ఆదివారం బిజెపి శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆపరేషన్ సింధూర్, భారత సైన్యం గురించి సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు. వెంటనే భారత సైన్యానికి క్షమాపణలు చెప్పాలని అన్నారు. మరోసారి భారత సైన్యం పై అనుచిత వాక్యాలు చేస్తే సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిలింగ్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, సీనియర్ నాయకులు కటికే రామ్ రాజ్, పార్వతి మురళి, రాజు, బిజెపి పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment