బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి.
జై భారత్ దినపత్రిక తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జనవరి 01 : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి,ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాజీ డిసిసిబి అధ్యక్షులు పోచారం భాస్కర్ రెడ్డిలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. గురువారం హైదరాబాద్ లో రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు పలు విషయాలపై ముచ్చటించినట్లు సమాచారం. శుభాకాంక్షలు తెలిపినపోచారం,ఆయన తనయుడు భాస్కర్ రెడ్డికి కూడా సీఎం శుభాకాంక్షలు తెలిపి ఉల్లాసంగా వారితో గడిపారు.











