దీపావళి పండుగను బాంబులతో జాగ్రత్తగా ఉండి సంబరాలు జరుపుకోండి.రాష్ట్ర యువజన కాంగ్రెస్ కొండా యువసేన నాయకులు సిలివేరు అనిల్.
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ అక్టోబర్ 19 : చీకట్లను తొలగించి వెలుగును అందించే పండుగ దీపావళి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర యువజన కాంగ్రెస్ కొండా యువసేన నాయకులు సిలివేరు అనిల్ అందరి జీవితాల్లో సరికొత్త వెలుగులను నింపే దీపావళి పండుగ సందర్భంగా పిల్లాపాపలతో తల్లితండ్రులతో ఆనందంగా గడపాలని సురక్షితంగా పండగను జరుపుకోవాలని కోరుతున్నాను. సంతోషాలలో భాగంగా బాణసంచా కాలుస్తూ అగ్ని ప్రమాదాలకు గురి కావొద్దు . చిన్న పిల్లలను బాణాసంచా కాల్చుతున్న తరుణంలో చాలా దూరంగా ఉండే విధంగా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలని పండుగ తరుణంలో మైనర్ పిల్లలకు ద్విచక్ర వాహనాలు తల్లిదండ్రులు ఇవ్వకండి వారికి ఏదైనా జరగరానిది జరిగితే పండుగ సందర్భంగా మళ్లీ మనం బాధపడుతూ ఉండవలసి వస్తుంది కావున ఇది గమనించగలరు అని నా యొక్క మనవి . వీలైనంత తక్కువ టపాకాయలు కాల్చుకొని శబ్ద కాలుష్యాన్ని వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో మనము కూడా భాగస్వామ్యం కుటుంబ సభ్యులందరితో కలిసి రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా సురక్షితంగా దీపావళి పండుగ జరుపుకోవాలని కోరుకుంటూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో రాష్ట్ర ప్రజలంతా చల్లగా వర్ధిల్లాలని మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు.









