ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 29 : (నవీన్ కుమార్ ) బాన్సువాడ మండలం పులిగుండు తండా పంచాయతీ పరిధిలో కాలు నాయక్ తండాలో విషాదం నెలకొంది. తండాలో ఓ బాలిక పాము కాటుకు గురై మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. తండాకు చెందిన శ్రీకాంత్ కూతురు చౌహన్ సరస్వతి బుధవారం ఉదయం వాంతులు చేసుకుంది. ఆందోళకు గురైన తల్లిదండ్రులు సరస్వతిని పరిశీలించడంతో కుడికాలిపై పాముకాటు గుర్తులను గమనించారు. వెంటనే కుటుంబ సభ్యులు బాలికను బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ జీజీహెచ్కు రిఫర్ చేశారు. మార్గమధ్యలో దుర్కి వద్ద బాలిక మృతి చెందింది. దీంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. తండ్రి చౌహాన్ శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తుల శ్రీధర్ తెలిపారు.









