రేవంత్ రేడ్డీ పాలన దమనకాండగా మారింది …మాజీ ఏం ఎల్ ఏ జీవన్ రెడ్డి.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:20 ( షేక్ గౌస్)
తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఆర్తనాదాలే వినిపిస్తున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం దమనకాండ పాలనను నడుపుతోందని బీఆర్‌ఎస్‌ నేత, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపించారు. రైతులు, చేనేతలు, కూలీలు, ఆటోడ్రైవర్లు, విద్యార్థులు, నిరుద్యోగులు ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రైతులకు సహాయం చేయాల్సిన ప్రభుత్వం, 500 మందికిపైగా రైతులకు బలి తీసుకున్నాదని మండిపడ్డారు. ప్రజలు నిలదిస్తే కేసులు, నిరసన తెలిపితే అరెస్టులు అనే పరిస్థితులు కొనసాగుతున్నాయని, పోలీసులను రాజకీయ ప్రత్యర్థులపై ఉసిగొలిపే పరిస్థితి దుర్మార్గమని విమర్శించారు.బీఆర్‌ఎస్‌ జెండా పట్టినా, ఫ్లెక్సీ కట్టినా, మౌనంగా ఉన్నా కేసులు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పాడుచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది అంబేద్కర్ రాజ్యాంగమా? రేవంత్ రాజ్యాంగమా? అని ప్రశ్నించారు.రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం పేరిట హింస, విధ్వంసమే జరుగుతోందని, త్వరలోనే కాంగ్రెస్ పాలనకు ప్రజలే ముగింపు పలుకుతారని జోస్యం పలికారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!