తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక డిసెంబర్ 12 : తెలంగాణలో మరో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ చోటు చేసుకుంది. 16 మంది విద్యార్థులకు అస్వస్థత కు గురయ్యారు. హైదరాబాద్ -బాగ్ లింగంపల్లి మైనారిటీ గురుకుల పాఠశాలలో రాత్రి భోజనం చేసిన అనంతరం 16 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలతో అవస్థ పడుతున్న విద్యార్థులను కింగ్ కోఠి ప్రభుత్వ ఆసుపత్రికి పాఠశాల సిబ్బంది తరలించారు.
గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.
Published On: December 13, 2025 1:41 am











