పోచంపాడు లో ఘోర రోడ్డు ప్రమాదం,ఒకరు మృతి

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ దినపత్రిక డిసెంబర్ 30 : మంగళవారం పోచంపాడు గ్రామంలో  విషాదం చోటుచేసుకుంది ట్రాక్టర్ ఢీకొని ప్రియాంక అనే ఓ మహిళ మృతి చెందింది. పోలీసుల కథన ప్రకారం పోచంపాడు గ్రామానికి చెందిన బొమ్మల ప్రియాంక  పోచంపాడు లోని సోషల్ వెల్ఫేర్ స్కూల్ లో స్టాఫ్ నర్సు గా పనిచే వారు , మంగళవారం మధ్యాహ్న భోజనం  చేసాక తన తమ్ముడి యొక్క మోటార్ సైకిల్ పై స్కూల్ కి వెళ్తుండగా వెనకవైపు నుండి వస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ వేముల మహేష్ తన ట్రాక్టర్ ను అతివేగంగా అజాగ్రత్తగా నడుపుతూ మోటార్ సైకిల్ కు ఢీ కోనగా వీరికి బలమైన గాయాలు తగిలాయి. హుటా హుటిన స్థానికులు  ప్రియాంకను నిర్మల్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యమం లోనే  ఆమె చనిపోయినట్లు గా మృతురా లీ తమ్ముడు ఇచ్చిన పిర్యాదు మేరకు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు  మెండోరా సబ్ ఇన్స్పెక్టర్ సుహాసిని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment