జై భారత్ దినపత్రిక నందిపేట్ ఫిబ్రవరి 05 :(షేక్ గౌస్) నందిపేట్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జిల్లాస్థాయి ‘సృజన’ టెక్నికల్ ఫెస్టివల్ ఘనంగా జరిగింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పాలిటెక్నిక్ కళాశాలల డిప్లొమా విద్యార్థులు పాల్గొని తమ వినూత్న సాంకేతిక ప్రాజెక్టులను ప్రదర్శించారు.బీఎస్ఎన్ఎల్ నిజామాబాద్ సబ్ డివిజనల్ ఇంజనీర్ సందీప్ కుమార్ రతి, కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఎలక్ట్రానిక్స్ విభాగాధిపతి మహిపాల్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి, ఉత్తమ ప్రాజెక్టులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. రాజ్ కుమార్‌తో పాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నందిపేట్ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో జిల్లాస్థాయి ‘సృజన’ టెక్నికల్ ఫెస్టివల్
Published On: February 5, 2026 7:04 pm











