నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 7.
నందిపేట్ మండలం షాపూర్ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న నిరడి నాగు కి రూ. 38,000 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కను కాంగ్రెస్ నాయకులు అందజేశారు. ఆర్మూర్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి కృషి ద్వారా ఈ చెక్క మంజూరు కాగా, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంద మహిపాల్ చెక్కను మంగళవారం బాధితుడికి అందజేశారు.ఈ కార్యక్రమంలో ధమ్మాయి శ్రీను, నిరడి సంతోష్, భోజన్న, ఆనంద్, నరేందర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.