తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 27.
సోమవారం నిజామాబాద్ నగరంలో న్యాయవాదిపై జరిగిన దాడిని నిరసిస్తూ బుధవారం బాన్సువాడ న్యాయవాదులు విధులను బహిష్కరించారు. న్యాయవాదిపై జరిగిన దాడి హేయమైన చర్యగా ఖండించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మూర్తి, రమాకాంత్, లక్ష్మారెడ్డి, అయ్యల ఆనంద్, మొగులయ్య, ఖలీల్, హమీద్ తదితరులు న్యాయవాదులు పాల్గొన్నారు.