వేల్పూర్ (భారత్ స్పెక్ట్రమ్) ఆగస్టు 02
వేల్పూర్ మండలంలోని రామన్నపేట గ్రామంలో ఆదివారం పడకంటి మొటాటి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. చూడాలని భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.
వేల్పూర్ మండలంలోని రామన్నపేట గ్రామంలో గల పడకంటి మొటాటి రెడ్డి సంఘం అధ్యక్షుడు పెద్దోళ్ల బాపురెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా పోచమ్మ పండుగ నిర్వహించారు. సంఘ భవనం గోడకు గల మైసమ్మకు సంఘం సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
సంఘ భవనం నుండి డప్పు చప్పుళ్ళతో ఊరేగింపుగా వెళ్లి బస్టాండ్ లో గల పోచమ్మ తల్లి వద్దకు చేరుకున్నారు. పోచమ్మ చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి గంపలో తీసుకొచ్చిన అన్నం, బెల్లమన్నం ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించి ఎలాంటి అంటువ్యాధులు సోకకుండా చూడాలని మొక్కులు తీర్చుకున్నారు. కొబ్బరికాయలు కొట్టారు. బండారు వేసి కల్లుసాక పోసారు. పుట్నాలు, బెల్లం, ఓమ మిశ్రమంతో కూడిన ప్రసాదాన్ని స్వీకరించారు.
పోచమ్మ, గుండేలవ్వ తల్లి కోసం గొర్రెలను తల్లి సన్నిధిలో బలిచ్చారు. పొట్టేలు జడ్త ఇవ్వగానే పులోరియా, పులోరియా అంటూ నినదించారు.
ఈ సందర్భంగా పడకంటి మొటాటి రెడ్డి సంఘం అధ్యక్షుడు పెద్దోళ్ల బాపురెడ్డి మాట్లాడుతూ ఆషాడ మాసంలోని ఆదివారం పోచమ్మ పండుగను నిర్వహించుకోవడం పూర్వం నుండి వస్తున్న సంప్రదాయ ఆచారం. గ్రామం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, సమస్త జీవకోటి ప్రాణులన్నీ బాగుండాలని అన్నారు.
కార్యక్రమంలో కోళ్లకాడు కంకణాల రవి, మాజీ అధ్యక్షుడు కంకణాల రాజేశ్వర్, పడకంటి బాపురెడ్డి, పంచాక్షర్ రెడ్డి, సాయరెడ్డి, మోహన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, మధు రెడ్డి, చిన్న గంగారెడ్డి, సంఘం సభ్యులు పాల్గొన్నారు.









