నిజామాబాద్, జూన్ 27
నందిపేట్ మండలంలోని సిద్ధాపూర్ గ్రామ శివారులో అక్రమంగా మొరం తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో 3 టిప్పర్లు, ఒక హిటాచీ, 200 కెపాసిటీ గల చైన్ మిషన్లను స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా మొరం తరలిస్తున్న ప్రాంతాలపై నందిపేట్ పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ క్రమంలో చైన్ మిషన్లు, జేసీబీ, టిప్పర్లను స్వాధీనం చేసుకున్నారు. నందిపేట ఎస్సై వినయ్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
నందిపేట మండలంలోని సిద్ధాపూర్ గ్రామ శివారులో పక్కా సమాచారం మేరకు కొంతమంది వ్యక్తులు అక్రమంగా మొరం తరలిస్తున్నారనే సమాచారంతో శనివారం పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 3 టిప్పర్లు, ఒక హిటాచీ, 200 కెపాసిటీ గల చైన్ మిషన్లను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు ఎస్సై వినయ్ వెల్లడించారు.
దాస్ నగర్ కి చెందిన 4 గురు, మాదాపూర్ కి చెందిన 1, దేగాం గ్రామానికి చెందిన 1 వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు నందిపేట ఎస్సై వినయ్ తెలిపారు.










